janamvoice.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 4:05 pm Digital Edition : JANAM VOICE

ధనుష్‌తో పెళ్లి పుకార్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ..

ధనుష్‌తో పెళ్లి పుకార్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ..

– ఏప్రిల్ 1న చేసుకుంటా అంటూ సెటైర్.

జనం వాయిస్, ముంబై – ఫిబ్రవరి 14:

సినీ రంగంలో పుకార్లు కొత్తవి కావు. నటీనటులు కలిసి ఒక కార్యక్రమంలో కనిపించినా వారిద్దరి మధ్య సంబంధం ఉందంటూ వార్తలు చక్కర్లు కొట్టడం సాధారణమే. ఇదే పరిస్థితి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ విషయంలో కనిపించింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వ్యక్తిగత కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించడం ఈ పుకార్లకు కారణమైంది. ఆ తర్వాత మృణాల్ నటించిన సినిమా కార్యక్రమానికి ధనుష్ హాజరుకావడంతో ఈ వార్తలు మరింత వేగం పుంజుకున్నాయి. అయితే ఈ ప్రచారంపై తాజాగా మృణాల్ స్పందిస్తూ స్పష్టత ఇచ్చింది. తన సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా “ఫిబ్రవరి 14న ధనుష్‌తో పెళ్లి చేసుకుంటున్నారా?” అన్న ప్రశ్నకు మృణాల్ నవ్వుతూ, “ఫిబ్రవరి 14 కాదు… ఏప్రిల్ 1న చేసుకుంటానేమో, అది మోసాల రోజు కదా!” అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చింది. ఈ వ్యాఖ్యతో పెళ్లి పుకార్లకు ఆమె సరదాగా చెక్ పెట్టింది. అదే సందర్భంగా ఈ వార్తలు ఎలా మొదలయ్యాయో కూడా తనకు తెలియదని, ఎలాంటి నిజం లేని విషయాలను నిజాలుగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తుందని ఆమె పేర్కొంది. తామిద్దరం కేవలం మంచి స్నేహితులమేనని, అంతకుమించి ఏమీ లేదని మరోసారి స్పష్టం చేసింది. దీంతో ధనుష్–మృణాల్ పెళ్లి వార్తలకు పూర్తి స్థాయిలో ముగింపు పలికినట్లైంది.