నయన్ లైఫ్‌స్టైల్ ఖర్చుపై విఘ్నేష్ వ్యాఖ్యలు.
నయన్ లైఫ్‌స్టైల్ ఖర్చుపై విఘ్నేష్ వ్యాఖ్యలు.జనం వాయిస్, హైదరాబాద్, మే 7: దక్షిణాది సినీ పరిశ్రమలో ‘లేడీ సూపర్ స్టార్’గా గుర్తింపు పొందిన నయనతార విలాసవంతమైన జీవనశైలి గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నయనతార సౌకర్యవంతమైన జీవితం గడపాలంటే రోజుకు ఎంత ఖర్చవుతుందనే అంశంపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నయనతార ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర నటిగా కొనసాగుతున్నారు. ‘జవాన్’ సినిమాతో వెయ్యి కోట్ల...