ఢిల్లీలో కాలుష్యానికి చెక్!.నేటి నుండి కొత్త నిబంధనలు!
జనం వాయిస్, న్యూఢీల్లి:
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రస్థాయికి చేరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం కఠిన నియ మాలు తీసుకుంటుంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 4 ఆం క్షలు అమలు చేయనుంది, ఈ ఆంక్షలు లో భాగంగా బీఎస్-6 ప్రమాణాలు లేని ఇంజన్ వాహనాల ప్రవేశం పై నేటి నుంచి ఢిల్లీలో సం పూర్ణ నిషేధం విధించింది.. అంతేకాకుండా, పొల్యూష న్ అండర్ కంట్రోల్ పీయూసీ,సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకు ల్లో ఇంధనం నింపవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నిర్ణయంతో ఢిల్లీ సరిహద్దు నగరాలైన గురుగ్రామ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా నుంచి రోజూ రాకపోకలు సాగించే సుమారు 12 లక్షల వాహనాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఇందులో ఘజియాబాద్ నుంచి 5.5 లక్షలు, నోయిడా నుంచి 4 లక్షలు, గురుగావ్ నుంచి 2 లక్షల వాహనాలు ఉన్నట్లు అంచనా. ఈ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు ప్రభుత్వం 126 చెక్‌పోస్టుల వద్ద 580 మంది పోలీసు సిబ్బందిని, 37 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృం దాలను మోహరించింది.పెట్రోల్ బంకుల వద్ద పీయూసీ నిబంధనను పర్యవేక్షించేందుకు రవాణా, మున్సిపల్, ఆహార శాఖల అధికారులను నియమించా రు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా పీయూసీ లేని వాహనాలను సులభంగా గుర్తించనున్నారు. శీతాకాలంలో ఢిల్లీ కాలుష్యంలో వాహనాల వాటా 25 శాతం వరకు ఉంటోందని అధ్యయనాలు తేల్చడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలకు ప్రత్యక్ష తరగ తులను నిలిపివేయగా, కార్యాలయాలు 50 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, బుధవారం సాయంత్రం ఢిల్లీ గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 334గా ‘చాలా పేలవం’ కేటగిరీలో నమోదైంది. ఇదే అంశంపై ఇవాళ లోక్‌సభలో చర్చ జరగనుండగా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేం దర్ యాదవ్ సమాధానం ఇవ్వనున్నారు.