కరవు వేళ గ్రామీణ కూలీలకు కొత్త జాబ్‌కార్డులు.
కరవు వేళ గ్రామీణ కూలీలకు కొత్త జాబ్‌కార్డులు.15 రోజుల్లో జారీకి ప్రభుత్వం ఆదేశాలు. 18 జిల్లాల్లో 265 మండలాలు కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు.జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబరు 5: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకునే అర్హులైన గ్రామీణ కుటుంబాలకు 15 రోజుల్లోనే జాబ్‌కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యవసాయ పనులు తగ్గడంతో గ్రామీణ కూలీలకు పనిదినాలు, ఆదాయం తగ్గుతున్న నేపథ్యంలో...