త్వరలో క్యూఆర్ కోడ్ తో కొత్త రేషన్ కార్డులు!
జనం వాయిస్, హైదరాబాద్, జూలై 18:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రాగానే కొత్త రేషన్ కార్డులపై దృష్టి పెట్టింది, అందుకు అనుగుణంగా లబ్ధి దారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవు తోంది. రాష్ట్రవ్యాప్తం గా 1.05 కోట్లకు పైగా కుటుంబాల కోసం క్యూఆర్ కోడ్‌తో రూపొందించిన రేషన్ కార్డుల ప్రింటింగ్ ఇ ప్పటికే పూర్తయింది.
ఈ కొత్త కార్డులను ఆయా జిల్లాలకు సైతం అధికార యం త్రాంగం చేరవేసింది. కార్డుల పంపిణీ తేదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరారు చేయడమే మిగిలి ఉంది. సీఎం నిర్ణ యం తీసుకోగానే, ఆ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయను న్నట్లు పౌర సరఫ రాల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ కొత్త స్మార్ట్రేషన్ కార్డులను క్రెడిట్, డెబిట్ కార్డు సైజులో తయారు చేశారు. ఫొటోపై కార్డు యజ మాని పేరు, అడ్రస్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, ఫొటోలను కార్డుపై ముద్రించి నట్లు సమాచారం.
ప్రస్తుతం రేషన్ కార్డులు కాగితం రూపంలో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కార్డు రూపంలో రేషన్ కార్డులు రానుండటం ఇదే తొలిసారి. కార్డుపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే రేషన్ లబ్ధిదారులైన ఆ కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఇప్పటి వరకు బియ్యం, చక్కెర, గోధుమలు వంటి రేషన్ వస్తువుల్ని తీసుకున్న పూర్తి వివరాలు కనిపిస్తాయి.