ఎన్ హెచ్ ఆర్ సి. కరీంనగర్ పట్టణ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజబాబు.
-అధికార ప్రతినిధిగా మన్నె శ్యాం కుమార్.
-నియామక పత్రాలు అందించిన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య.
-కరీంనగర్ పట్టణ అధ్యక్షులు మేడి విష్ణు ప్రసాద్.
జనం వాయిస్, కరీంనగర్:
జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) కరీంనగర్ పట్టణ కమిటీ ఉపాధ్యక్షులుగా ధరావత్ రాజబాబు, అధికార ప్రతినిధిగా మన్నె శ్యామ్ కుమార్ లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య నియామక పత్రాలు అందజేసినట్లు పట్టణ అధ్యక్షులు మేడి విష్ణు ప్రసాద్ తెలిపారు. బలమైన లీగల్ ప్రొసీజర్ తో, ప్రోటోకాల్సిష్టంతో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకుపోతున్న జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు పని చేయాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా పట్టణ ఉపాధ్యక్షులు ధరావత్ రాజబాబు, పట్టణ అధికార ప్రతినిధి మన్నె శ్యాం కుమార్ లు మాట్లాడుతూ తమపై ఎంత నమ్మకంతో అప్పగించిన ఈ పదవులకు న్యాయం చేస్తామని, నీతి నిజాయితీగా పేద ప్రజల పక్షాన నిలబడి సమస్యలకు పరిష్కారం కోసం కృషి చేస్తామని వారన్నారు. కరీంనగర్ పట్టణంలో ఎన్ హెచ్ ఆర్ సి. అన్ని డివిజన్ కమిటీలను త్వరలోనే పూర్తి చేస్తామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కనకయ్య, జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్, ఉపాధ్యక్షురాలు లతా రెడ్డి, కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి అసద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.