నిజామాబాద్‌లో ఉద్రిక్తత..పోలీస్ వాహనంపై మృతదేహం కట్టి నిరసన.
నిజామాబాద్‌లో ఉద్రిక్తత..పోలీస్ వాహనంపై మృతదేహం కట్టి నిరసన. -ప్రేమ వ్యవహారంలో మోసపోయానని యువకుడి ఆత్మహత్య.-ఏర్గట్ల పోలీస్ స్టేషన్ వైపు ముట్టడి ప్రయత్నం.-పోలీసుల అడ్డుకట్టపై ఆగ్రహం, రాస్తారోకోతో ఉద్రిక్త పరిస్థితులు.జనం వాయిస్,నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రేమించి మోసపోయానని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువకుడి మృతదేహాన్ని గ్రామస్థులు పోలీస్ వాహనంపై కట్టి నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దోంచందా గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా ఆగ్రహావేశానికి దారితీసింది. దోంచందాకు...