janamvoice.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 3:43 pm Digital Edition : JANAM VOICE

త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

జనం వాయిస్, తెలంగాణ వెబ్ డెస్క్:

హైదరాబాద్:మే 30
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర పోలీసు శాఖను బలో పేతం చేసే విధంగా దాదాపు 5వేల పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్న ట్టు తెలుస్తుంది, దీనికి సంబంధించిన ప్రతిపా దనలు పోలీసు శాఖ నుంచి ఆర్థికశాఖ కు చేరినట్లు సమాచారం.
తెలంగాణ పోలీసు శాఖలో 19వేలకుపైగా పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దశల వారీగా పోస్టు లను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న ట్లు తెలి సింది. ఈ క్రమంలోనే ముందుగా 5వేల పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైన ట్లు సమాచారం. మిగిలిన 14వేల ఖాళీలను ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే భర్తీకి చర్యలు తీసు కోవాలని, ప్రభు త్వం భావిస్తుంది..
పోలీసుశాఖలో ఇటీవల ప్రతి ఏడాది సుమారు 2వేల మందికిపైగా వివిధ హోదాల్లోని పోలీసులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఉన్నవారిపై పనిభారం అధికమవు తోంది. ఈ క్రమంలో రిక్రూట్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయను న్నట్లు తెలుస్తోంది.
ఈసారి చేపట్టబోయే పోలీసు రిక్రూట్మెంట్ లో ఎంపికైన వారిలో అత్యధికులను దేశాని కి సవాలుగా మారిన సైబర్ నేరాలు, మత్తు మందుల కట్టడికి సంబంధించిన విభాగాల్లో వాడుకోవా లని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు ఉన్నతాధికా రులను ఆదేశించినట్లు సమాచారం.