తిరుమలగిరిలో క్షుద్ర పూజలు కలకలం

తిరుమలగిరిలో క్షుద్ర పూజలు కలకలం.బొమ్మలు,నిమ్మకాయలు చూసి గ్రామస్తుల ఆందోళన.పాలకుర్తి, జూన్  6 జనం వాయిస్:జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామంలో శనివారం చేతబడి కలకలం రేపింది.గ్రామంలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ఆధారాలు లభ్యమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం... శనివారం ఉదయం గ్రామ శివారులోని చేతబడికి ఉపయోగించే బొమ్మలు, నిమ్మకాయలు,పసుపు, కుంకుమ చల్లిన పూజా సామాగ్రి పడి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆధునిక...