janamvoice.com
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 1:59 pm Digital Edition : JANAM VOICE

మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్.

మంథని మున్సిపల్ చైర్మన్ గా ఓడ్నాల శ్రీనివాస్.

– వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డి.

జనం వాయిస్, మంథని:

మంథని పురపాలక సంఘం రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మంథని మున్సిపల్ చైర్మన్‌గా సోమవారం ఓడ్నాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీపై తన పట్టును నిరూపించుకుంది. అభివృద్ధి పథంలో మంథని బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఓడ్నాల  శ్రీనివాస్ మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సమస్య పరిష్కారం మరియు పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.వైస్ చైర్మన్ గా ముస్కుల సహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మంథని మున్సిపాలిటీలో 13 వార్డులకు ఎన్నికలు జరుగగా 11 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 1 వార్డు బిఆర్ఎస్ పార్టీ, 1 వార్డు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవాసం చేసుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడంతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. గెలుపొందిన చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మిగతా 11 మంది కౌన్సిలర్లతో ఆర్డిఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ ప్రమాణ స్వీకారం చేయించారు.