janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 2:36 pm Digital Edition : GATTU MAHESH

ఆయిల్ ఫామ్ పంట వేయండి.ఆదాయాన్ని అర్జీంచండి. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు

ఆయిల్ ఫామ్ పంట వేయండి.

ఆదాయాన్ని అర్జీంచండి.

పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.

జనం వాయిస్,సుల్తానాబాద్,నవంబర్ 15:

72 వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్బంగా ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించడానికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం లోని చిన్నకల్వల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జిల్లా ఉద్యాన శాఖ మరియు తిరుమల ఆయిల్ కేం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ రమణారావు కు ఘన స్వాగతం పలికారు.ఆయిల్ ఫామ్ సాగు చేయడం ద్వారా 35 సంవత్సరాల పాటు అధిక లాభాలు వస్తాయని తెలిపారు.అలాగే తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీలు,డ్రిప్పు  పరికరాలు అందించి సాగును ప్రోత్సహిస్తుందని తెలిపారు.ఒక్కసారి మొక్కలు నాటితే మూడు సంవత్సరాల తర్వాత నిరంతరం 35 సంవత్సరాల పాటు అధిక లాభాలు వస్తాయన్నారు.మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలు కూడా వేసుకోవచ్చునని పేర్కొన్నారు.పంట మార్పిడి ద్వారా దిగుబడి అధికంగా పెరుగడమే కాకుండా రైతులు కూడా లాభాల బాట పడుతారని అన్నారు.వరి తో పోలిస్తే నాలుగు రేట్లు ఆదాయం ఎక్కువ,ప్రకృతి వైపారీత్యాల వల్ల వానలు,వరదలు వచ్చిన ఆయిల్ ఫామ్ పంటకి ఎలాంటి నష్టం వాటిల్లదని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మినుపల ప్రకాష్ రావు,చిన్నకల్వల సహకార సంఘం చైర్మన్ మోహన్ రావు,సీఈఓ రమేష్, సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.