janamvoice.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 9:49 am Digital Edition : JANAM VOICE

అధ్వాన్నంగా మారిన వన్ ఇంక్లైన్ అండర్ రైల్వే బ్రిడ్జి రోడ్డు.

  • అధ్వాన్నంగా మారిన వన్ ఇంక్లైన్ అండర్ రైల్వే బ్రిడ్జి రోడ్డు.
  • పట్టించుకోని సింగరేణి అధికారులు -ఇబ్బంందులు పడుతున్న వాహాన దారులు, ప్రజలు – కార్మికులు.
  • రోడ్డు పక్కనే ఉన్న చెత్త కుప్పలను తొలగించండి.
  • రోడ్డు పై పారుతున్న నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి.
  • సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్.
  • జనం వాయిస్, గోదావరిఖని, మే 18:
  • సింగరేణి ఆర్జీ వన్ ఏరియా లోని జిడికె వన్ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు అధ్వాన్నంగా తయారైందని, రోడ్డు పై పారుతున్న నీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా రోడ్డు పక్కన ఉన్న చెత్త కుప్పలను తొలగించాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ ఒక ప్రకటన లో సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రోడ్డు పక్కనే చెత్త కుప్పలను తొలగించక పోవడం వల్ల వాహాన దారులు దుర్వాసన తో ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు పై యైటింక్లయిన్ కాలనీ కి వెళ్ళే త్రాగు నీటి పైపు లైన్ లీకేజీ కారణంగా గ్యాలన్ ల కొద్ది నీరు వృధాగా పోవడం వల్ల రోడ్డు పై నీరు నిల్వ ఉండి బురద మయంగా మారిందని ఆయన అన్నారు. నిత్యం ఈ రోడ్డు మీదుగా డ్యూటీలకు వెళ్ళే కార్మికులు, ఉద్యోగులు, సమీప నివాస ప్రాంతాలైన జనగామ, సుందిల్ల, ముస్త్యాల ప్రజలు ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కారులలో ప్రయాణం చేసే వారు చెత్త కుప్పలనుండి వచ్చే దుర్వాసనను, రోడ్డు పై ఉన్న బురద నీరు వారిపై పడడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. రోడ్డు పక్కన చెత్త కుప్పలు పోయకుండా, రోడ్డు పై బురద నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన సింగరేణి యాజమాన్యాన్ని మరియు అర్జీ వన్ అధికారులను ఒక ప్రకటన లో డిమాండ్ చేశారు.