మమ్ముట్టికి పద్మ భూషణ్, రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్‌లకు పద్మశ్రీ.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. మొత్తంగా 113 మందికి పద్మశ్రీ, 13 మందికి పద్మభూషణ్. 5 గురికి పద్మ విభూషణ్ అవార్డులను కేంద్రం ఆదివారం ప్రకటించింది. వీరిలో సినీ నటులు కేరళ నుంచి మమ్ముట్టి, గాయని అల్కా యాజ్ఞిక్‌లకు పద్మ భూషణ్, తెలుగు నుంచి రాజేంద్ర ప్రసాద్ , మురళీ మోహన్ లకు, తమిళ నటుడు మాదవన్, బెంగాలీ నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీలకు పద్మశ్రీ, బాలీవుడ్ నుంచి దివంగత ధర్మేంద్ర కు పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించింది..