janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 11:52 am Digital Edition : GATTU MAHESH

పాఠశాలల అభివృద్ధి పనులు జిల్లా అధికారులు పర్యవేక్షించాలి.-జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.

పాఠశాలల అభివృద్ధి పనులు జిల్లా అధికారులు పర్యవేక్షించాలి.-జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.

-ప్రతి జిల్లా అధికారికి రెండు ప్రభుత్వ పాఠశాలలు కేటాయింపు.

-నవంబర్ 22 నాటికి నిరుపయోగంగా ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు అందించాలి.

-పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్,పెద్దపల్లి,నవంబర్-15:

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసే విధంగా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష అన్నారు.శనివారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పాఠశాలల పర్యవేక్షణ, ప్రభుత్వ బ్యాంక్ ఖాతాల నిర్వహణ పై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖలలో  వినియోగించని బ్యాంకు ఖాతాలలో జమ చేసి ఉన్న ఆర్.బి.ఐ నుంచి వెనక్కి తీసుకునేందుకు  కే.వై.సి వివరాలు, రిక్వెస్ట్ లెటర్ సంబంధిత శాఖలు అందించాలని కలెక్టర్ సూచించారు. నవంబర్ 22 నాటికి పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ శాఖల పరిధిలో ఉపయోగించని బ్యాంకు ఖాతాల నుంచి  ఆర్.బి.ఐ ఫ్రీజ్ చెసిన డబ్బులు వెనక్కి తీసుకునేందుకు కార్యచరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. డిసెంబర్ చివరి నాటికి పెద్దపెల్లి జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో అవసరమైన మౌలిక వసతుల పనులు పూర్తి చేసే దిశగా నిధులు మంజూరు చేయడం జరిగిందని,కలెక్టరేట్ నుంచి దాదాపు 30 కోట్ల నిధులు మంజూరు చేసి పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పనులు చేపట్టామని అన్నారు.ప్రతి జిల్లా అధికారికి రెండు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి,అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించాలని,రాబోయే 5 సంవత్సరాలకు సంబంధించి పాఠశాలలో అవసరమైన మేర అభివృద్ధి పనులు జరిగేలా చూడాలని, పాఠశాల అవసరాలకు ఇంకా ఏమైనా పనులు చేపట్టాల్సి ఉంటే ప్రతిపాదనలు అందించాలని అవసరమైన నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు అందరూ పాల్గొన్నారు.