janamvoice.com
Newspaper Banner
Date of Publish : 05 December 2025, 7:11 pm Digital Edition : GATTU MAHESH

పంచాయతీ ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి.

పంచాయతీ ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలి.

-జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.

-మొదటి విడత పోలింగ్ జరిగే మండలాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్,మంథని,డిసెంబర్-05:

పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష తెలిపారు.శుక్రవారం జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష మొదటి విడత పోలింగ్ జరిగే కమాన్ పూర్ , రామగిరి మంథని ,ముత్తారం, శ్రీరాంపూర్ మండలాల లోని ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల సంబంధించి డిసెంబర్ 6న పోలింగ్ సిబ్బంది శిక్షణ కార్యక్రమం కట్టుదిట్టంగా నిర్వహించాలని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంపిడివో కార్యాలయం వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి  పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ సూచించారు.బ్యాలెట్ పత్రాల ముద్రణ పంపిణీ నిబంధన ప్రకారం సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.పంచాయతీ ఎన్నికల సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల, రిసెప్షన్ సెంటర్లో వద్ద ఏర్పాట్లు పై కలెక్టర్ పలు సూచనలు చేశారు.అనంతరం మంథని పట్టణంలోని శ్రీపాద మార్గ్  4 లైన్ విస్తరణ పనుల కోసం అలైన్మెంట్ ను కలెక్టర్ పరిశీలించి ట్రెంచ్ కట్టింగ్ పనులు సజావుగా జరిగేలా చూడాలని అన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వింటే మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జడ్పీ సీఈఓ నరేందర్, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.