నవంబర్ 4 నభారత వాయుసేనలో చేరేందుకు అవగాహన సదస్సు.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
జనం వాయిస్,పెద్దపల్లి ,నవంబర్ 01:
భారత వాయుసేనలో చేరేందుకు నవంబర్ 4న మంగళవారం రోజున బంధం పల్లి లోని స్వరూప గార్డెన్స్ లో అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ” కమాండింగ్ ఆఫీసర్” భర్తీ అధికారి (ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రం) ఈ కార్యక్రమంలో పాల్గొనే యువతకు భారత వాయుసేనలో చేరడం ఎలా వాయుసేనలో అవకాశాలు ఎలా ఉంటాయి, పరీక్ష విధానం,సిలబస్ ,పూర్తి సెలక్షన్ ప్రాసెస్ గురించి అభ్యర్థులకు వివరించడం జరుగుతుందన్నారు.భారత వాయుసేనలో చేరేందుకు ఇదొక సువర్ణ అవకాశంగా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క అభ్యర్థి వినియోగించుకొని పెద్దపల్లి నుండి అత్యధిక యువత భారత వాయుసేనలో చేరాలని తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగును.16 సంవత్సరాల వయసు నుండి 21 సంవత్సరాల వయసు ఇంటర్మీడియట్ చదువుతున్న, ఆపై చదువు పూర్తి చేసుకున్న పురుష, మహిళ అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.భారత వాయుసేనలో చేరడానికి గల అవకాశాలను వివరిస్తూ తెలుపబడే బుక్లెట్ ని ఇవ్వడం జరుగుతుందని,మరిన్ని వివరాలకై ఫోన్ నెంబర్లకు 9949725997, 8333044460 సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.