janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 12:50 pm Digital Edition : GATTU MAHESH

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి.

ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి.

-పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి.

-గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పై అవగాహన సదస్సు.

జనం వాయిస్, ముత్తారం:

ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని పెద్దపల్లి డిసిపి భూక్య రామ్ రెడ్డి అభ్యర్థులకు ఓటర్లకు సూచించారు.పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని సమస్యత్మక గ్రామాలైన ఖమ్మంపల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడేడు ముత్తారం, కేశనపల్లి గ్రామాలలో అభ్యర్థులకు, ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ పై అవగాహన సదస్సు కల్పించారు.ఈ సందర్భంగా డీసీపీ మీడియాతో మాట్లాడుతూ… ఎలాంటి గొడవలకు తావు లేకుండా కేసులు కాకుండా జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.మీ గ్రామాన్ని అభివృద్ధిపరిచే వ్యక్తిని ఎన్నుకోవాలని మీరు ఎన్నుకునే వ్యక్తి పైన మీ గ్రామ అభివృద్ధి మరియు మీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తెలిపారు.తన వెంట గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, సిఐ రాజు, ఎస్సై రవీందర్, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు.