janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 5:45 pm Digital Edition : GATTU MAHESH

నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహణ.-జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.

నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహణ.-జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత.
-కేసులు రాజీ చేసుకోవాలనుకుంటే న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలి.
-3 సంవత్సరాల లోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు రాజీ చేయవచ్చు.
-స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ పై పత్రికా సమావేశం నిర్వహించిన జిల్లా జడ్జి.

జనం వాయిస్,పెద్దపల్లి, నవంబర్-01:

నవంబర్ 15న స్పెషల్ లోక్ అథాలత్ నిర్వహిస్తున్నామని , రాజీ చేసుకోవాలనుకునే వారు దీనిని వినియోగించుకొని కోర్టు కేసుల నుంచి ఉపశమనం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత అన్నారు.రంగంపల్లి లోని జిల్లా కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహణ పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత,జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి
కే.స్వప్న రాణి తో కలిసి  పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ, లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్ ,సివిల్ కేసులకు లోక అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు.ఇంటి గోడవలు, భూమి తగాదాలు యాక్సిడెంట్ , భార్యాభర్తల వివాదాలు, చెక్ బౌన్స్  వంటి వివిధ కేసులను లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని అన్నారు.ప్రమాద కేసులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు.3 సంవత్సరాలలోపు శిక్ష పడే క్రిమినల్ కేసులు కూడా లోక్ అథాలత్ లో రాజీ చేసుకునే అవకాశం ఉందని  అన్నారు. లోక్ అదాలత్ లో పరిష్కారం చేసుకున్న కేసుల్లో మళ్ళీ ఉన్నత కోర్టులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదని అన్నారు.లోక్ అథాలత్ పట్ల గ్రామీణ ప్రజలకు విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నవంబర్ 15న  నంది మేడారం సుల్తానాబాద్,పెద్దపల్లి, మంథని, రామగుండం కోర్టులలో స్పెషల్ లోక్ అథాలత్  నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు దీనిని వినియోగించుకుని చిన్నచిన్న కేసులు రాజీ చేసుకోవాలని ఆమె కోరారు.లోక్ అథాలత్ లో మాత్రమే కాకుండా కోర్టు సమయాలలో కూడా న్యాయ సేవాధికారి సంస్థ వద్దకు వచ్చి కేసు రాజీ చేసుకోవాలనుకుంటున్నాం అని తెలిపితే ఇతర పక్షాల వారిని పిలిచి చర్చించి రాజీ చేసేందుకు ప్రయత్నించడం జరుగుతుందని అన్నారు.ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.