janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 9:35 pm Digital Edition : GATTU MAHESH

బోనీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ.-పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం.

బోనీ కొట్టిన కాంగ్రెస్ పార్టీ.-పెద్దపల్లి నియోజకవర్గంలో ఆరుగురు సర్పంచులు ఏకగ్రీవం.

-కాంగ్రెస్ బలపరిచే అభ్యర్థులనే ఎన్నుకోండి.

-ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గడప గడపకు చేరేందుకు గాను పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులనే గెలిపించాలి.

-పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణ రావు.

జనం వాయిస్, పెద్దపల్లి:

పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సుల్తానాబాద్ మండలం లోని నారాయణరావుపల్లి సర్పంచ్ గా నామని రాజిరెడ్డి, గొల్లపల్లి సర్పంచ్ గా కొత్తూరి స్వరూప, రామునిపల్లి సర్పంచ్ గా సబ్బని అనసూయ, పెద్దపల్లి మండలం రాంపల్లి సర్పంచ్ గా కనపర్తి సంపత్ రావు, ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి సర్పంచ్ గా పిట్టల రవీందర్ మరియు ఎలిగేడు మండలం ర్యాకల్ దేవుపల్లి గ్రామ సర్పంచ్ గా మద్దెల రమాదేవి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.వారందరికీ మంగళవారం రోజున సుల్తానాబాద్ యశోద నరహరి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు వారికి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు.ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే సర్పంచులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని ఎన్నుకుంటే మరింత అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ అవుతుందని చెప్పారు. ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ పక్షాలకు ఎమ్మెల్యే విజయరమణ రావు కృతజ్ఞతలు తెలిపారు.రానున్న రోజుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు.శాంతియుత, సమైక్య నినాదానికి సర్పంచులు ఏకగ్రీవ ఎన్నికలు నిదర్శనమన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.