తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు.
తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు. ప్రజలకు గౌరవప్రదమైన సేవలే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. మంత్రి పొంగులేటి. జనం వాయిస్, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలనే లక్ష్యంతో తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ భుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగడం సరైంది...