మీడియాపై పోలీస్ జులుం – ఇదేనా ‘ప్రజా ప్రభుత్వం’?
తెల్లవారుజామున జర్నలిస్టుల అరెస్టులు.మీడియాపై పోలీస్ జులుం – ఇదేనా ‘ప్రజా ప్రభుత్వం’?జనం వాయిస్, హైదరాబాద్ : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్‌టీవీకి చెందిన జర్నలిస్టుల అరెస్టుల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. జర్నలిస్టులు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నిరసనల నడుమ అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి బెయిల్ మంజూరు చేయడం—ఈ కేసు ఎంత అత్యుత్సాహంగా ముందుకు నడిపించబడిందన్నదానికి నిదర్శనంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పండుగ సెలవుల నిమిత్తం కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్...