తెల్లవారు జామున అంబటిపల్లి లో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.
– సి ఐ వెంకటేశ్వర్లు.
జనం వాయిస్, మహాదేవపూర్, జూన్ 25:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని అంబటిపల్లి గ్రామంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆదేశాల మేరకు మహదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో, గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటింటి తనిఖీలు చేపట్టారు. సి ఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.అనుమానిత వ్యక్తులు, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల వివరాలను సేకరించి ప్రత్యేక తనిఖీలు నిర్వహించమని తనిఖీలో భాగంగా 30 లీటర్ల గుడుంబాను సీజ్ చేశామని మొత్తం 65 వాహనాలను తనిఖీ చేయగా, నంబర్ ప్లేట్లు లేని 6 వాహనాలను గుర్తించి పోలీస్ స్టేషన్‌కు తరలించమని .వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు మరియు ఇతర రికార్డులను పరిశీలించి . డాక్యుమెంట్ లేని వాటికీ జరిమానా వేయడం జరిగిందనీ. అలాగే
గ్రామంలో గుడుంబా వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. గుడుంబా సేవించడం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, నేరాల పెరుగుదల మరియు సామాజిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. ఈ కార్యక్రమం లో మహదేవపూర్ ఎస్ఎచ్ఓ ఎస్సై ఏం. సాంబమూర్తి. ఎస్సై జె రమేష్ కాళేశ్వరం ఎస్సై భగవత్ పాలిమేల ఎస్సై సాయి శశాంక్. మరియు పోలీసు సిబ్బంది పలువురు పాల్గొన్నారు.