తెల్లవారు జామున అంబటిపల్లి లో  పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.

తెల్లవారు జామున అంబటిపల్లి లో  పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్.- సి ఐ వెంకటేశ్వర్లు. జనం వాయిస్, మహాదేవపూర్, జూన్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని అంబటిపల్లి గ్రామంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నివారణ లక్ష్యంగా గురువారం తెల్లవారుజామున పోలీసులు విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ  ఆదేశాల మేరకు మహదేవ్‌పూర్ సీఐ వెంకటేశ్వర్లు  పర్యవేక్షణలో,  గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటింటి తనిఖీలు చేపట్టారు....