ఓటు వేయడానికి వచ్చిన అవ్వకి…పోలీస్ బిడ్డ చేయూత.
జనం వాయిస్, పెద్దపల్లి:
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ ధర్మారం మండలం లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మల్లాపూర్ గ్రామం లో పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వచ్చిన వృద్ధ అవ్వకు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ సౌజన్య మానవీయత చాటుకున్నారు. నడవలేని పరిస్థితిలో ఉన్న అవ్వను చేయిపట్టి సహకరించి, ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ బిడ్డ సహాయం అందించారు.ఈ ఘటన అక్కడున్న ప్రజల మనసులను ఆకట్టుకోగా, ఎన్నికల విధుల్లో పోలీస్ శాఖ కేవలం భద్రతకే పరిమితం కాకుండా సేవాభావంతో పనిచేస్తోందని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదనే భావనతో పోలీసులు చూపిన ఈ మానవీయతకు ఓటర్లు ప్రశంసలు తెలిపారు.