దళితులపై కపట ప్రేమతో రాజకీయం.
– దళితులను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్న నాయకులు.
– దళిత నాయకులు లింగంపల్లి అన్వేష్.
జనం వాయిస్, జమ్మికుంట:
అసెంబ్లీలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు దళితులపై కపట ప్రేమ చూపిస్తూ రాజకీయంగా నాటకాలు చేస్తున్నారు. అదే సమయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఇదే కోణంగా రాజకీయం చేయడం చాలా సిగ్గుచేటని దళిత నాయకులు లింగంపల్లి అన్వేష్ తీవ్రంగా మండిపడ్డారు. వారు మాట్లాడుతూ ..ఏ రాజకీయ నాయకులు కానీ దళితులపై కపట ప్రేమ చూపడమే తప్ప వారిని కలిసినప్పుడు కనీసం దగ్గర కూడా రానీయకపోవడం తాకకుండా ఉండడం ఇలా చేస్తూ రాజకీయంగా వారు దళితులంటూ దూరం పెడుతూ అవమానం చేయడం అదే రాజకీయ నాయకు లకు దళితులపై ప్రేమ ఉంటే హుజురాబాద్ నియోజకవర్గం లో ఈరోజుకు కూడా దళిత బంధు రెండో విడత నిధులు ఇవ్వడంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని, దళితులను కేవలం వాళ్ల రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడమే తప్ప ఏ దళిత నాయకుడిని పైకి తీసుకొచ్చిన రోజు లేదు. రాజకీయంగా వాడుకుంటూ వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఎన్నిసార్లు అవమానిస్తున్న వాళ్ల నాయకులపై అభిమానంతో పలుమార్లు ఇబ్బందులకు గురైన ఏదో ఒక రోజు మాకు న్యాయం జరుగుతుందని వాళ్ల చుట్టూ తిరుగుతున్న ఈరోజు వరకు ఒక గుర్తింపు ఉండడం లేదని నియోజకవర్గంలోని ఎంతోమంది దళిత నాయకులు పలుమార్లు తమ బాధల్ని హృదయంలోనే తొక్కుకోవడం పైకి సంతోషంగా ఉంటూ నాయకుల కోసం ఎన్నో కేసులు పెట్టిన జైలుకు కూడా వెళ్లి వచ్చారని ప్రస్తుతం రాజకీయ నాయకులు దళితుల పట్ల రాజకీయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని, ఇప్పటికైనా దళిత నాయకులకు మంచి పదవులు ఇచ్చి ఒక స్థాయి కల్పించాలని మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నట్లు దళిత నాయకులు లింగంపల్లి అన్వేష్ తెలిపారు.