janamvoice.com
Newspaper Banner
Date of Publish : 09 December 2025, 10:35 pm Digital Edition : GATTU MAHESH

బీసీ లు తమ హక్కుల సాధనకు ఐక్యం కావాలి.

బీసీ లు తమ హక్కుల సాధనకు ఐక్యం కావాలి.

-అడ్వకేట్ పొన్నం రవీందర్ యాదవ్.

జనంవాయిస్, తెలంగాణ:

ప్రముఖ న్యాయవాది పొన్నం రవీందర్ యాదవ్ ను బీసీ జన భోజనాల కార్యక్రమానికి ఆహ్వానించిన బీసీ జనాభోజనాల కమిటీ సభ్యులు.పొన్నం రవీందర్ యాదవ్ ను తన కార్యాలయంలో బీసీ జనాభోజనాల కార్యక్రమానికి  కమిటీ సభ్యులు చామకూర రాజు, కేవీ గౌడ్,విశ్వనాథుల పుష్పగిరి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పొన్నం రవీందర్ యాదవ్ మాట్లాడుతూ సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి పునాది వేస్తుందన్న సిద్ధాంతం ప్రకారం బీసీలకు సాంస్కృతిక ఐక్యత బీసీ ఉద్యమానికి తక్షనావసరమని,బీసీ కులాల ఐక్యత లేకుండా బీసీ ఉద్యమం బలపడడం సాధ్యపడదని, 130 బీసీ కులాల మధ్య సాంస్కృతిక సారూప్యతను తెలియజేసే దిశగా బీసీ జన భోజనాల కార్యక్రమాన్ని వేదికగా బీసీ ఉద్యమాన్ని నిర్మించాలని తెలిపారు.