janamvoice.com
Newspaper Banner
Date of Publish : 07 October 2026, 8:23 pm Digital Edition : JANAM VOICE

ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది: భట్టి.

ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది: భట్టి.

19,892 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌.

కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం.

జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 7:

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 19,892 మెగావాట్ల గరిష్ఠ విద్యుత్ డిమాండ్ నమోదైందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు, కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేస్తూ నిరంతర సరఫరాకు కృషి చేస్తున్నారని అభినందించారు. విద్యుత్ సిబ్బందిని అభినందించాల్సింది పోయి కొందరు విమర్శలు చేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేస్తున్నారని భట్టి విమర్శించారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం అంశంపై కూడా ఆయన స్పందిస్తూ, ఆ ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఉందా? కనీసం బొగ్గు సరఫరా ప్రణాళిక చేశారా? అని ప్రశ్నించారు.