గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన ప్రణవ్.
– ప్రజా ప్రభుత్వంలో అందరికి ఆమోదయోగ్యంగా నిధుల విడుదల..
– గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి.
– నియోజక వర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
జనం వాయిస్, కరీంనగర్:
సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్.ఈ సందర్భంగా ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని అంతేకాకుండా ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఎన్నికల తర్వాత గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించామని తెలిపారు.ప్రజా ప్రభుత్వంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి విషయంలో కూడా రాజీపడకుండా నిధులు కేటాయిస్తూ ముందుకు వెళ్తున్నామని ఇటీవలే సన్నవడ్లు పండించిన ప్రతి రైతు ఖాతాలో 500 బోనస్ చెల్లించామని ఇప్పుడు ఈ నిధులు చెల్లించామని అన్నారు.అలాగే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.