janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 December 2025, 11:00 pm Digital Edition : GATTU MAHESH

ప్రియదర్శి ‘మిత్రమండలి’ టెలివిజన్‌లో అదృష్టం పరీక్ష.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?<br>

ప్రియదర్శి ‘మిత్రమండలి’ టెలివిజన్‌లో అదృష్టం పరీక్ష.. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా?

జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22:

ప్రియదర్శి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విష్ణు ఓయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ డ్రామా చిత్రం ‘మిత్రమండలి’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ నిహారిక ఎన్ ఎం ఈ సినిమాతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. విజయేందర్ ఎస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.అయితే థియేటర్లలో దక్కని విజయాన్ని డిజిటల్ వేదికపై అందుకోవాలన్న ఉద్దేశంతో ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ప్రైమ్ వీడియో ఇండియా చార్ట్స్‌లో ప్రస్తుతం ఐదవ స్థానంలో ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. డిజిటల్ విడుదల కోసం కొన్ని సన్నివేశాలను తొలగించి రీ ఎడిటెడ్ వెర్షన్‌ను మేకర్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జీ తెలుగు ఛానల్‌లో ఆదివారం డిసెంబర్ 28 సాయంత్రం 6:30 గంటల నుంచి ‘మిత్రమండలి’ ప్రసారం కానుంది. ఓటీటీ ప్రేక్షకుల నుంచి వచ్చిన యావరేజ్ స్పందన నేపథ్యంలో టెలివిజన్ ప్రేక్షకుల దగ్గరైనా ఈ సినిమా ఇంప్రెస్ చేస్తుందా లేదా అన్న ఆసక్తి నెలకొంది.
బన్నీ వాస్ సమర్పణలో బీవీ వర్క్స్ బ్యానర్‌పై కల్యాణ్ మంథిన, భాను ప్రతాప్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించిన ఈ సినిమా టెలివిజన్ ప్రసారంతో మరోసారి చర్చకు దారితీయనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.