ఎస్సైని రాయితో కొట్టి వారి కారు అద్దాలను పగలగిట్టిన ఆందోళనకారులు.
జనం వాయిస్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లాలోని సీతాగోంది కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.కేంద్రం వద్దకు భారీగా ఆందోళనకారులు చేరుకున్నారు.దీంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఎస్సై పురుషోత్తం వారిని హెచ్చరించారు.ఈ క్రమంలో ఇద్దరు యువకులు SIని రాయితో కొట్టారు.దీంతో ఎస్సై తలకు గాయమైంది.అలాగే పోలీసుల జీపును కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు.చెన్నూరు(M) బావురావు పేటలో కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక్క ఓటు విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.