janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 November 2025, 1:16 pm Digital Edition : GATTU MAHESH

జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితేనే నిజమైన స్వాతంత్య్రం.-మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

జూబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడితేనే నిజమైన స్వాతంత్య్రం…
– ప్రచారంలో పాల్గొనే ప్రతి ఒక్కరి పేరు గుర్తుండిపోతది
– ప్రజలే న్యాయ నిర్ణేతలని కాంగ్రెస్‌కు అర్థం అయ్యేలా చేయాలి
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

జనం వాయిస్, మంథని:

జూబ్లిహిల్స్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతేనే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్రం వస్తుందనే భావన అందరిలో నెలకొందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రహమత్ నగర్ డివిజన్ 161,162 బూత్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి పట్టిన శని, పీడ కాంగ్రెస్‌ పార్టీ అని ఆయన అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన నష్టం కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వ హాయాంలో తెలంగాణ రాష్ట్రం ద్వంసం చేసిండ్లన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆనాడు పోరాటం చేసినోళ్ల, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఎలా గుర్తుంటారో అదే రీతిలో జూబ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వారి పేర్లు గుర్తుండి పోతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోవాలని ప్రతి గడప కోరుకుంటుందని అందుకోసం మీరంతా ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు.మిగిలిన ఐదు రోజులు ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని, కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ల వద్దకు తీసుకురావాలన్నారు. మనం చూస్తుండగానే మనం వింటుండగానే మోసం చేస్తున్నారని, అధికారంతో నెత్తికెక్కిన కళ్లను దించాలంటే జూబ్లిలో కాంగ్రెస్‌ ఓడిపోవాలని, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే న్యాయనిర్ణేతలని వాళ్లకు ప్రజలే ఓనర్లని అర్థం కావాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ డబ్బులను ఆఖరు అస్త్రంగా ఉపయోగిస్తారని, గ్రామాల్లో డబ్బుకు మోస పోయి గోసపడుతున్నారనే విషయాన్ని ప్రచారంలో ప్రతి గడపకు చేర్చాలన్నారు. రాష్ట్రంలో పాలన సరిగ్గా లేకపోవడం మూలంగానే అరిష్టం వచ్చిందని, ఓ వైపు ఎండ, వాన, చలి వస్తున్నాయని ఇన్నేండ్లలో ఇలాంటి వాతావరణం తాను ఎన్నడూ చూడలేదన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి బీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పనిచేయాలని, ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా బావిస్తున్నానని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. సమావేశం అనంతరం జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.