janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 7:43 pm Digital Edition : GATTU MAHESH

ఆర్ఎ ప్రాజెక్టు ద్వారా మచ్చుపేట రైతులకు శిక్షణ.-ఫీల్డ్ ఆఫీసర్ కలవేన మధుకర్.

ఆర్ఎ ప్రాజెక్టు ద్వారా మచ్చుపేట రైతులకు శిక్షణ.
-ఫీల్డ్ ఆఫీసర్ కలవేన మధుకర్.

జనం వాయిస్,ముత్తారం:

ముత్తారం మండల మచ్చుపేట గ్రామంలో ఆర్ఎ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం ఉదయం రైతులకు శిక్షణా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ కలవేన మధుకర్ మాట్లాడుతూ పంట పునరుత్పత్తి, కవర్ క్రాపింగ్, పంట మార్పిడి, బహు పంటలు, అంతర పంటలు, సహజ ఎరువుల వినియోగం, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల తగ్గింపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే నీటి వినియోగ సామర్థ్యం, బాల కార్మికుల నిర్మూలన, కార్మికుల వేతనాలు, హక్కులు, పత్తి పంట తీయడం, నిల్వ, రవాణా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అనంతరం రైతులకు వేపనూనె, పీఎన్బీ, లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, పీపీఈ కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్ ఆఫీసర్స్ ఎస్. రాజశేఖర్, ఈర్ల మహేందర్ , రైతులు, తదితరులు పాల్గొన్నారు.