మహారాష్ట్రను ముంచెత్తుతున్న వానలు.
మహారాష్ట్రను ముంచెత్తుతున్న వానలు. 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు. జనం వాయిస్, ముంబై, జూలై 7: మహారాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఉగ్రరూపం దాల్చాయి. గత 48 గంటలుగా కురుస్తున్న అసాధారణ భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబైతో పాటు సాంస్కృతిక రాజధాని పుణె నగరం పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా పుణె జిల్లాలోని పశ్చిమ కనుమలు పరిధిలో మేఘమథనం జరుగుతోంది. ఘాట్ సెక్షన్లలోని పలు వాతావరణ కేంద్రాల్లో ఇప్పటికే 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, పుణె నగర...