వేసవిలో వానల సందడి… తెలంగాణకు రెయిన్ అలర్ట్ – పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
వేసవిలో వానల సందడి… తెలంగాణకు రెయిన్ అలర్ట్ – పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు జనం వాయిస్, వెబ్ డెస్క్:తెలంగాణ రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఎండలు భగ్గుమంటున్నా… మరోవైపు ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగనున్నాయి. ఈ అకాల వర్షాలు ప్రజలకు వేసవి తీవ్రత నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ, రైతులు మాత్రం పండిన పంటలు దెబ్బతింటాయేమోనని...