janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 10:19 am Digital Edition : JANAM VOICE

రేపే రైతు భరోసా నిధులు విడుదల..!

రేపే రైతు భరోసా నిధులు విడుదల..!

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా డబ్బులు రేపు జమ కానున్నాయి, యాసంగి, సీజన్ ప్రారంభం నుంచి పెట్టుబడి సహాయం కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలోనే ఈనెల 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ సాగు పెట్టుబ డి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలని,రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదికగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం స్వయంగా బటన్ నొక్కి ఈ పథకాన్ని ప్రారంభించను న్నారు. ఈ నిధుల విడుదలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. రాష్ట్ర ఖజా నాపై భారం పడకుండా, అదే సమయంలో రైతు లకు సకాలంలో సాయం అందేలా ప్రభుత్వం ఒక పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మొత్తం నిధులను ఒకేసారి కాకుండా మూడు విడత ల్లో పంపిణీ చేయాలని నిర్ణయించారు. నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే  ఈ నగదు జమ కానుంది. తొలి విడతలో భాగంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఒక ఎకరం వరకు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతుల ఖాతాల్లోకి ఈ నెల 22న రూ.3,590 కోట్లు చేరనున్నాయి. ఈ విడత పూర్తయిన సరిగ్గా 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు విడుదల చేస్తారు. రెండో దశలో సుమారు రూ.2,650 కోట్లను పంపిణీ చేయాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల ఎక్కువ భూమి ఉన్న రైతులకు కూడా ఆర్థిక తోడ్పాటు అందనుంది. ఇక ఏప్రిల్ నెలాఖరు నాటికి మూడో విడత నిధులను కూడా ఇచ్చేసి, ఈ సీజన్ రైతు భరోసా ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయనుంది. మొత్తంగా మూడు విడతల్లో కలిపి సుమారు రూ.9,000 కోట్లు రైతుల చేతికి అందనున్నా యి. గతంలో నిధుల విడు దల ఆలస్యమవడంతో రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నూ ఏప్రిల్ లోపే పంపిణీ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం తో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది రైతుకు టుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.