తెలుగు లోగిళ్లలో ‘రంజాన్’ శోభ.ఆధ్యాత్మికత.. ఆప్యాయతల సంగమం!

తెలుగు లోగిళ్లలో ‘రంజాన్’ శోభ.ఆధ్యాత్మికత.. ఆప్యాయతల సంగమం! జనం వాయిస్, వెబ్ డెస్క్: నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, నిరుపేదల పట్ల దాతృత్వం.. వెరసి రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణాన్ని మోసుకొచ్చింది. గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా నిలిచే మన తెలుగు గడ్డపై ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకుంటున్నారు. నగరాల్లో సందడి.. ప్రార్థనలతో పునీతం హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదు నుంచి మొదలుకొని, విజయవాడ, కర్నూలు, కడప వంటి నగరాల్లోని ఈద్గాలు...