janamvoice.com
Newspaper Banner
Date of Publish : 01 November 2025, 5:56 am Digital Edition : GATTU MAHESH

ఈ రోజు రాశి ఫలాలు  (1-11-2025).

ఈ రోజు రాశి ఫలాలు  (1-11-2025).

జనం వాయిస్, రాశి ఫలాలు:

మేష రాశి:

విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది.కుటుంబ కలహాలకు తావీయరాదు.ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది.వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఉన్న వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

వృషభ రాశి:

నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.అశుభవార్తలు వినాల్సి వస్తుంది.మనస్తాపానికి గురవుతారు.ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం.ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడటం మంచిది.

మిథున రాశి:

కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది.వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి.వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

కర్కాటక రాశి:

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు.సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు.మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు.శత్రు బాధలు తొలగిపోతాయి.ఆకస్మిక లాభాలు ఉంటాయి.

సింహ రాశి:

ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు.స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.

కన్యా రాశి:

ఆత్మీయుల సహకారం లభిస్తుంది.ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులవుతారు.అధికార భయం ఉంటుంది.ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

తులా రాశి:

వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు.అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.

వృశ్చిక రాశి:

కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు.ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.ప్రయత్నకార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

ధనుస్సు రాశి:

కుటుంబ కలహాలు దూరమవుతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి

మకర రాశి:

గౌరవ మర్యాదలకు లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతోనే కాలం గడపాల్సి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తవహించాలి. శారీరకంగా బలహీనులవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

కుంభ రాశి:

ఇతరులకు హాని తలపెట్టే పనులకు దూరంగా ఉంటారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. కొత్త పనులకు ఆటంకాలేర్పడతాయి. కాబట్టి కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది. మీ దురుసుతనం వల్ల ఇతరులు ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీన రాశి:

ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అవలీలగా అధిగమిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయవద్దు. ఉద్యోగులకు మిశ్రమ సమయం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. సన్నిహితుల నుంచి ఆర్థిక లబ్ధి ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.