ఈ రోజు రాశి ఫలాలు(05-11-2025).
మేష రాశి
ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.గుండె సమస్యలు ఉన్నవారు జాగ్రత్తలు పాటించాలి.అవసరమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.ఆర్థికంగా బాగుంటుంది. పిల్లలతో గడపడానికి ఇష్టపడతారు. వృత్తి పరంగా మంచి లాభాలు పొందుతారు. మీకు ఏ విధంగా సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండి.
వృషభ రాశి
మీ శారీరక పటిష్టతకు పనికి వచ్చే క్రీడను ఆడడానికి ఆనందించడానికి అవకాశం ఉంది.మీ స్నేహితులతో సంతోషంగా గడపాడానికి ఇష్టపడతారు.విద్యార్థులు క్రీడల్లో రాణిస్తారు.ఆఫీసులో ఎవరితోనైనా మాట్లాడేందుకు మీరు చాలాకాలంగా ఎదురు చూస్తూ గనక ఉన్నట్టయితే, ఆ మంచి రోజు ఈ రోజే కానుంది.అనుకోని అతిథి మీ ఇంటికి రావడం జరుగుతుంది.
మిథున రాశి
ఈ రాశివారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి.ఈరోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారం బాగా చేస్తారు.ఇది మీకు ఆర్ధికంగా కూడా అనుకూలిస్తుంది.కుటుంబంతో ఆనందంతో గడపండి.మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.పనిచేసే చోట తలెత్తే కష్టాలు, సమస్యలకు సరియైన వేళకు సహోద్యోగుల నుండి సహాయం అందగలదు.అది మీకు వృత్తిపరంగా మంచి పేరు తెచ్చిపెడుతుంది.వైవాహిక జీవితం బాగుంటుంది.
కర్కాటక రాశి
మీరు ఏ వృత్తిలో ఉన్న మీ పనిని పై అధికారులు పరీక్షించడం జరుగుతుంది.ఏకాగ్రతతో పని చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.ఈరోజు డబ్బు విషయంలో ఇంటి పెద్దవారి నుంచి సలహాలు పొందుతారు.ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి.స్నేహితులతో చేసే పనులు సంతోషాన్నిస్తాయి.వైవాహిక జీవితం రోజుకంటే ఈ రోజు మరింత బాగుంటుంది.
సింహ రాశి
ఆరోగ్యం మెరుగుపడుతుంది.కొంత మందికి ప్రయాణంలో ఒత్తిడిని కలిగిస్తుంది.కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే.మీ వ్యక్తిత్వం,ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయ పడతాయి.పని ఒత్తిడి మిమ్ములను మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది.మీకు, మీ జీవిత భాగస్వామికి నిజంగా,మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం.
కన్యా రాశి
ఒత్తిడి మీకు చిన్నపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుంది.రిలాక్స్ అవడానికి స్నేహితులు,కుటుంబ సభ్యులతో గడపండి.దగ్గర వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నవారు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.స్నేహితులతో బయటకు వెళ్లి ఖర్చులు చేస్తే అవకాశం ఉంది.డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం.ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈరోజు మంచిగా ఉండవు.మీ సహుద్యోగులో ఒకరు మీకు ద్రోహం చేస్తారు. వైవాహిక జీవితం బాగుంది.
తులా రాశి
ఈ రోజు ఒక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనవల్సి వస్తుంది. దానికి విచారించాల్సిన అవసరం లేదు. ఫ్రేండ్స్‌తో గడపడం వల్ల దీనిని నుంచి బయటడొచ్చు.ఈరోజు మియొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు.యువతను కలుపుకుని పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం.ఈ రోజు,మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు.ఆఫీసులో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు.వైవాహిక జీవితంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చిక రాశి
మీ టెన్షన్ నుంచి బయటపడవచ్చు.కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును.ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి కారణం అవుతాయి.ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు.వైవాహిక జీవితం బాగుంటుంది.
ధనుస్సు రాశి
ఈరోజు ఎన్ని సమస్యలు ఎదురైనా సంతోషంతో ఎదుర్కొంటారు.మనోధైర్యంతో ముందుకెళ్తుంటారు.మీ మిత్రులలో ఎవరైతే అప్పు అడిగి తిరిగి చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండండి.మీరు ఏదైనా కమిట్ మెంట్ చేసుకోవాలనుకుంటే దానికి ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా చెప్పండి.దీంతో మంచి ప్రశంసలు పొందుతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
మకర రాశి
ఈ రోజు పిల్లలతో ఆనందంగా గడుపుతారు.మీ భాగస్వామితో కుటుంబ సమస్యలు చర్చిస్తారు.ఇది మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది.ఆర్థికంగా కలిసివస్తుంది.ఈరోజు మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించడంతో ప్రశంసలు పొందుతారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కుంభ రాశి
ఈ రాశి వారు గతం తాలూకు చేదు జ్ఞాపకాలను మర్చిపోవడం మంచిది.లేకపోతే అనారోగ్యానికి గురవుతారు.ఏ సమస్యైనా తల్లిదండ్రులతో చర్చించడం మంచిది.పిల్లలతో రోజు గడవడం కష్టంగా అనిపిస్తుంది.ఒత్తిడిగా ఫీల్ అవుతారు.మీ పనిలో అభివృద్ధికరమైన మార్పులు తీసుకు రావడంలో మీ సహ ఉద్యోగులు సాయం చేస్తారు. క్రింద పనిచేసే ఉద్యోగులు ఖాళీ సమయములో సమస్యలకు తగిన పరిష్కారం ఆలోచిస్తారు.మీతో కలిసి ఉండటం గురించి.. మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు చెప్పవచ్చు.
మీన రాశి
ఆర్థికంగా బాగుంది.ఈ రోజు మీరు ప్రశాంతమైన జీవితం గడపాలనే ఆలోచనలో ఉంటారు.డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడతారు.మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.ఇంట్లో సమస్యలు తలెత్తవచ్చు. మీ పనిలో మీలాగ ఆలోచించే స్నేహితుల సహకారం తీసుకొండి.మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ లకి, ఇది మంచి రోజు.మీలో కొంతమంది దూరప్రయాణాలకు సిద్ధమవుతారు.ఈ రోజు మీ రోజువారీ అవసరాలు తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు.