ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన రష్మిక
– వివాహ విందుకు ఆహ్వానం.
– ఆత్మీయ భేటీ, అందమైన బహుమతికి కృతజ్ఞతలు.
జనం వాయిస్, హైదరాబాద్, మార్చి 01:
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సినీ నటుడు సినీ నటి రష్మిక మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట తమ వివాహ విందుకు ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఆహ్వానించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గీత, నైమిషాతో కలిసి ఆత్మీయంగా సమయం గడిపినట్లు పేర్కొన్నారు. ఈ భేటీ ఎంతో మధురంగా సాగిందని రష్మిక తన సందేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి కుటుంబంతో జరిగిన ముచ్చట్లు ఎంతో సంతోషాన్ని కలిగించాయని చెప్పారు. అందించిన అందమైన బహుమతికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వివాహ విందుకు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆశీర్వదించాలని ఈ జంట కోరినట్లు సమాచారం. రాజకీయ, సినీ వర్గాల్లో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి కుటుంబంతో జరిగిన ఈ ఆత్మీయ సమావేశం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అవుతోంది.
