రేషన్ కార్డుదారులకు అలర్ట్.
జనం వాయిస్, తెలంగాణ :
తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి KYC పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.