janamvoice.com
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 5:48 pm Digital Edition : JANAM VOICE

రాష్ట్ర ఆర్యవైశ్య యువజన కార్యదర్శిగా రావికంటి సతీష్ కుమార్ నియామకం.

రాష్ట్ర ఆర్యవైశ్య యువజన కార్యదర్శిగా రావికంటి సతీష్ కుమార్ నియామకం.

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం నూతన కార్యవర్గంలో చోటు.

జనం వాయిస్, మంథని, ఆగస్టు 02: l

మంథని పట్టణానికి చెందిన రావికంటి సతీష్‌ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం లభించింది. హైదరాబాద్‌లోని లక్డికాపూల్ వాసవి కళ్యాణ మండపంలో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన విభాగం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘ నాయకులు, యువజన ప్రతినిధులు, ప్రముఖుల సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమాజాభివృద్ధి, యువత సంక్షేమం, సేవా కార్యక్రమాల విస్తరణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రావికంటి సతీష్ కుమార్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులవడం పట్ల మంథని ప్రాంత ఆర్యవైశ్య సంఘ నాయకులు, వ్యాపారవేత్తలు, యువజన ప్రతినిధులు, మిత్రులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సమాజ అభివృద్ధికి విశేష సేవలు అందించాలని ఆకాంక్షించారు.