janamvoice.com
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 4:22 pm Digital Edition : JANAM VOICE

విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్.

విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్.

– పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

జనం వాయిస్, పెద్దపల్లి, మే-04

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీ కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఉత్తర్వులు జారీ చేశారు. కె. చిరంజీవి  విధులకు గైర్హాజరు కావడంతో పాటు, ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడం, వివరణ కోరుతూ జారీ చేసిన మెమోలను స్వీకరించకపోవడం గమనార్హమని కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై కమాన్‌పూర్ తహసీల్దార్ నివేదిక అందడంతో, సంబంధిత ఉద్యోగిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, శాఖాపరమైన విచారణ చేపట్టనున్న నేపథ్యంలో, ఎ.పి. సివిల్ సర్వీసెస్ (సీసీఏ) నిబంధనల ప్రకారం శ్రీ కె. చిరంజీవిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి అమల్లో ఉంటాయని, విచారణ పూర్తయ్యే వరకు కొనసాగుతాయని తెలిపారు. సస్పెన్షన్ కాలంలో సంబంధిత ఉద్యోగి ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను వీడరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.