janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 1:25 am Digital Edition : JANAM VOICE

రాయలసీమకు ఏం చేశారు? రూ.24,000 కోట్లు ఎక్కడ?: చంద్రబాబుపై రోజా ఫైర్.

రాయలసీమకు ఏం చేశారు? రూ.24,000 కోట్లు ఎక్కడ?: చంద్రబాబుపై రోజా ఫైర్.

  • రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలపై ప్రభుత్వం విఫలమైందని రోజా విమర్శ
  • కరవు, చంద్రబాబు కవలలుగా అభివర్ణన
  • ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రకటించాలని సవాల్.

జనం వాయిస్, ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 8:

ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాయలసీమలో కరవు, సాగునీటి సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, అభివృద్ధిపై కేవలం గొప్పలు చెబుతోందని ఆమె ఆరోపించారు. చిత్తూరులో మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ మాటలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదన్నారు.

“రాయలసీమపై ప్రేమ ఉందని చెబుతారు. కానీ ఈ ప్రాంతానికి ఏం చేశారు? రూ.24,000 కోట్లతో ప్రాజెక్టులు చేపట్టామని అంటున్నారు. అవి ఎక్కడున్నాయో ప్రజలకు చూపించండి” అని రోజా సవాల్ విసిరారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరవు, చంద్రబాబు కవలలని, ప్రస్తుత పాలనలో నీటి కొరత మరింత తీవ్రమైందని ఆమె వ్యాఖ్యానించారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ హయాంలో చేపట్టిన సాగునీటి, వ్యవసాయ చర్యల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని రోజా సూచించారు. ‘రైజింగ్ రాయలసీమ’ అంటూ నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, కొత్తగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారో అధికారిక లెక్కలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పోటీ పడుతున్నారని ఆమె ఆరోపించారు.