గణపతి నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు.

గణపతి నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా. గోదావరి బ్రిడ్జి నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన సీపీ, కలెక్టర్. జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 23: గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన...