janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 12:25 pm Digital Edition : GATTU MAHESH

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి.!

మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పై మరో దాడి.!

జనం వాయిస్,వరంగల్:

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల పై ఈ మధ్య దాడులకు సంబంధించిన ఘటనలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న హకీంపేటలో బస్సు డ్రైవర్ పై దాడి, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మరువక ముందే వరంగల్ జిల్లాలో మరో దాడి జరిగింది..వరంగల్ జిల్లా నర్సంపేట దగ్గర బస్సు ఎక్కిన మందుబాబులు డ్రైవర్ తో గొడవకు దిగారు.

గేర్ బాక్స్ పైన కూర్చొని బూతు పురాణం మొదలుపెట్టారు నర్సంపేట ఎమ్మెల్యే తన బంధువు అని చెప్పి మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్ పైదాడి చేశారు. అడ్డుకోబోయిన కండక్టర్ పై కూడా వారు దాడికి దిగారు.దీంతో డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు మందు బాబు ల దాడికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు.