ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు: సీఎం రేవంత్ రెడ్డి.!
రేపు చర్చలకు రండి ఆర్టీసీ జేఏసీకి పిలుపు.!
జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 23:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు కాగా గురువారం పలుచోట్ల కార్మికులు క్షణికావేశానికి లోనై ఆత్మహత్యయత్నం లకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట లో శంకర్ అనే ఆర్టీసీ డ్రైవర్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించు కోగా.. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు ఆయన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది..
ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెపై తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలకం గా చర్చ జరుగుతుండగా. సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించా రు.ప్రాణాలు తీసుకోవడం సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం చేసిన ఆయ న.. కార్మికుల సమస్యల ను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రేపు ఆర్టీసీ జేఏసీ ని చర్చలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రుల కమిటీతో చర్చలకు రావా లని కార్మిక సంఘాలకు పిలుపు నిచ్చింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రుల బృందం కార్మిక సంఘాలతో భేటీ కానుంది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, కార్మికులు తొందరపడొద్దని, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. కార్మికులు ప్రాణాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే, కార్మికులు సంయమనం పాటించాలని మంత్రి శ్రీధర్‌బాబు, సూచించారు. ప్రాణాలు తీసుకోవడం సరైంది కాదని, ఆర్టీసీ కార్మికుల పాత్ర రాష్ట్ర సాధనలో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు.