janamvoice.com
Newspaper Banner
Date of Publish : 13 December 2025, 9:14 pm Digital Edition : GATTU MAHESH

శబరిమలలో ఘోర ప్రమాదం..ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌..

శబరిమలలో ఘోర ప్రమాదం..ఏపీ భక్తులపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్‌..

జనం వాయిస్, కేరళ:

శబరిమలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కొండదిగే సమయంలో అదుపుతప్పిన ట్రాక్టర్‌ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 9 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడగా, పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ఇతర భక్తులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. శబరిమల యాత్ర మార్గంలో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.