ధనుష్‌తో మరోసారి జతకడుతున్న సాయిపల్లవి.
జనం వాయిస్, సినిమా:
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తొచ్చేది ‘మారి 2’ చిత్రంలోని రౌడీ బేబీ పాట. ఆ పాటతో పాటు ఇద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై కలిసి కనిపించబోతున్నట్లు సమాచారం.
ధనుష్ కెరీర్‌లో 55వ చిత్రంగా తెరకెక్కుతున్న తాజా సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంపికైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే శ్రీలీలను ఒక కథానాయికగా తీసుకోగా, మరో కీలక మహిళా పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అమరన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వం వహించనున్నాడు. కథ, పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సాయిపల్లవి ఈ సినిమాకు ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని సమాచారం. ధనుష్, సాయిపల్లవి కాంబో మళ్లీ రిపీట్ కావడంతో అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.