పేరు మార్చుకోనున్న సమంత..?
జనం వాయిస్, సినిమా:
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ నెలలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితుల మధ్య కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో, సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశీస్సులతో ఈ వివాహం సాదాసీదాగా జరిగింది. వివాహం తర్వాత కూడా సమంత తన సినీ కెరీర్‌లో చురుగ్గా కొనసాగుతూ కొత్త చిత్రాలపై దృష్టి పెట్టారు.
ఇదిలా ఉండగా, సమంత తన పేరులో మార్పు చేసుకోనున్నారన్న వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సమంత అసలు పేరు సమంత రూత్ ప్రభు. తాజాగా రాజ్ నిడిమోరుతో వివాహం అనంతరం, తన భర్త ఇంటిపేరును తన పేరు చివర చేర్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టు సమాచారం. దీంతో ఇకపై ఆమె పేరు సమంత నిడిమోరుగా మారే అవకాశముందని తెలుస్తోంది.
ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో నటిస్తున్నారు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా, సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్స్‌లో సమంత పేరు సమంత నిడిమోరుగా కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.