*సంకష్టహరచతుర్థి*

*సంకష్టహరచతుర్థి* ప్రతి మాసంలోనూ కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత వచ్చే నాలుగోరోజు సంకష్టహర చతుర్థి. ఆరోజున గణపతి ఆరాధన చేయాలి. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలను తొలగించి, విజయపథంలో నడిపిస్తుంది. తలపెట్టిన ఏ పనీ ముందుకు పోకుండా, అన్నిటా విఘ్నాలు కలుగుతూ ఉన్నప్పుడు... అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు బాధిస్తున్నప్పుడు... రుణబాధలతో పాటు జీవితంలో అనేక రకాలయిన కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు... ప్రతి మాసంలోనూ సంకట హర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలు కలగడంతోబాటు, కార్యజయం కలుగుతుంది....